: దత్త పుత్రుడు దొరికాడని..రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు: లగడపాటి


రాజ్యాంగ సవరణ చేస్తేనే తప్ప రాష్ట్ర విభజన జరగదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దత్తపుత్రుడు దొరికాడని విభజనపై ముందుకెళ్లడం సరికాదని కాంగ్రెస్ అధిష్ఠానానికి హితవు పలికారు. తాము అరువు, బరువు, దరువు, అవిటి పుత్రులం కాదని ఈ సందర్భంగా లగడపాటి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరగాలంటే ఆర్టికల్ 317 డి సవరించాలని, రాజ్యాంగ సవరణ లేకుండా విభజన జరగదని లగడపాటి చెప్పారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ఎంపీల అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉంటుందని, అందుకే ఎంపీలంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని లగడపాటి అన్నారు.

  • Loading...

More Telugu News