: 14 ఏళ్ల బాలుడికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డు


ఇంగ్లాండ్ కి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వరల్డ్ వైడ్ సంయుక్తంగా నిర్వహించిన యంగ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2013 అవార్డును భారత్ కు చెందిన 14 సంవత్సరాల ఉదయన్ రావ్ పవార్ సొంతం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని చంబల్ నదిలో ఓ మొసలి తన పిల్లలను తలపై ఉంచి తీసుకెళుతున్న దృశ్యాన్ని ఉదయన్ తన కేనన్ ఈఓఎస్ 550డి కెమెరాతో బంధించాడు. 'మదర్స్ లిటిల్ హెడ్ ఫుల్' అని క్యాప్షన్ రాసి పోటీకి పంపించాడు. ఆ ఫోటోనే ఉదయన్ కి అవార్డు సంపాదించి పెట్టింది.

  • Loading...

More Telugu News