: చాట్ తిన్న 50 మంది పిల్లలకు అస్వస్థత


రోడ్డు పక్కన లభించే చాట్ తిన్న 50 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాచిపోయిన చాట్ విషాహారంగా మారడంతో పిల్లలు వాంతులు, కడుపునొప్పితో విలవిల్లాడారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూరు జిల్లా రాంపూర్ గ్రామంలో జరిగింది. అస్వస్థతకు గురైన పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News