: మానవ హక్కుల కమిషన్ లో విశాలాంధ్ర మహాసభ ఫిర్యాదు
విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఈ రోజు హైదరాబాదులో మానవ హక్కుల కమిషనర్ ను కలిశారు. విజయనగరంలో కర్ఫ్యూ తదనంతర పరిణామాల నేపథ్యంలో కనిపించకుండా పోయిన 200 మంది ఆచూకీ తెలపాలని వారు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమ ప్రతినిధులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని విశాలాంధ్ర మహాసభ మానవ హక్కుల కమిషన్ ను కోరింది.