: యువకుడి ప్రాణాలు బలిగొన్న క్రికెట్ బెట్టింగ్
కడప జిల్లా రాజంపేట మండలం పులపత్తూరులో క్రికెట్ బెట్టింగ్ కారణంగా రాజశేఖర్ రెడ్డి(24) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి మిద్దెపై నిద్రిస్తున్న రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆయుధాలతో నరికి హత్య చేశారు. మృతుడి తల, మెడపై గాయాలున్నాయి. క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.