: పోలీసులకు ఇకపై వనవాసం శిక్ష!
ఇకపై అక్కడి పోలీసులు చాలా జాగ్రత్తగా వుండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా 24 గంటల వనవాసం చేయాల్సి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలపై జోకులేస్తూ ... అసభ్యంగా ... అమర్యాదకరంగా మాట్లాడితే ఒక రోజల్లా సదరు పోలీసు ఒంటరిగా... అడవిలో మృగాల మధ్య గడపాల్సి వస్తుంది. పోలీసు స్టేషన్ కి వచ్చే వారి పట్ల పోలీసులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ పలు ఆరోపణలు వస్తుండడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా ఇలాంటి పోలీసులకు పదిహేను రోజుల గడువు ఇస్తామనీ, అప్పటికీ మారకుంటే ఇక ఈ శిక్ష తప్పదనీ పోలీస్ బాస్ చెబుతున్నారు. శిక్షకు గురైన పోలీసు తన వెంట రెండు మంచినీళ్ల బాటిళ్ళు, వండని తిను బండారాలు తీసుకెళ్లచ్చని కాస్త మినహాయింపు ఇచ్చారు. మరి, ఇప్పటికైనా అక్కడి పోలీసులు మారతారా? లేక ఈ సరికొత్త అడవి శిక్ష అనుభవిస్తారా?