: మాస్టర్.. ఆ రికార్డును బద్దలు కొట్టాలి: భండారీ
రామ్ భండారీ.. బ్యాట్ తో బాల్ ను చీల్చి చెండాడి కోట్లాది మంది అభిమానుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న సచిన్ కు సుపరిచితుడు. సచిన్ కు రామ్ భండారీ కొత్త బ్యాట్లు తయారు చేసివ్వడంతోపాటు పాతవి 20 బ్యాట్ ల వరకూ రిపేర్ చేసిచ్చాడు. మరిప్పుడు భండారీ మనసులో ఒక కోర్కె ఉంది. బ్రియాన్ లారా పేరిట ఉన్న టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 400*ను.. సచిన్ బ్రేక్ చేస్తే చూడాలని కోరుకుంటున్నాడు. ఆ రికార్డు అరుదైనదని, దాన్ని సచిన్ సాధిస్తే భారతీయులందరికీ గర్వకారణమని భండారీ అంటున్నాడు.