: కృత్రిమ క్లోమాన్ని కూడా తయారుచేయవచ్చు


శరీరంలో పలు అవయవాలను కృత్రిమంగా తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. మూలకణాలతో పలు అవయవాలను ఇప్పటికే ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేస్తున్నారు కూడా. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తలు త్రీడీ పద్ధతిలో సూక్ష్మస్థాయి క్లోమగ్రంధిని రూపొందించారు. తాము సాధించిన విజయం మనిషి మూలకణాలనుండి సూక్ష్మస్థాయి క్లోమాన్ని తయారు చేయడానికి ఒక మంచి మార్గంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కోపెన్‌హగెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు త్రీడీ పద్ధతిలో సూక్ష్మస్థాయి క్లోమగ్రంధి సూక్ష్మ నమూనాను తయారుచేశారు. ఇందుకోసం ఒక వినూత్నమైన త్రీడీ కల్చర్‌ పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనకోసం వీరు ఎలుకల కణజాలాన్ని తీసుకున్నారు. దీనికి క్లోమగ్రంధి తాలూకు నాలుగు కణాలను జోడించి అభివృద్ధి పరిచారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఇవి 40 వేల కణాల స్థాయికి పెరిగాయి. వీటిని క్రమంగా క్లోమగ్రంధి రూపంలోకి తీసుకువచ్చారు. ఈ సూక్ష్మస్థాయి క్లోమ నమూనాలు కొత్త ఔషధాల పరీక్షల్లో ఎంతగానో ఉపయోగపడతాయని, మనుషులపై కొత్త ఔషధాల ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ఈ క్లోమగ్రంధిపై పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే పద్ధతిలో మధుమేహాన్ని ఎదుర్కొనే కణచికిత్సను కూడా అభివృద్ధి పరచాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News