: ఎమ్మెల్యే ఇంటికి కన్నం


అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో, అందులోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నివాసంలో దొంగతనం జరిగింది. మూడు లక్షల రూపాయల నగదు, భూ ఒప్పంద దస్తావేజులు ఇతర విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. అస్సాంలో గౌహతిలో ఎమ్మెల్యే సుశాంత్ బొర్గొహైన్ ఇంట్లో లేని సమయంలో బెడ్రూం కిటీకీ బద్దలు కొట్టిన దొంగలు, లోనికి ప్రవేశించి అందినకాడికి దోచుకెళ్లారు. ఎమ్మెల్యే బుధవారం ఇంటికొచ్చి జరిగినది గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఇంట్లో పనిచేసే వ్యక్తులను విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News