: రైతులను ఎలా ఓదార్చాలో అర్థం కావడంలేదు: విజయమ్మ


ఫైలిన్ తుపాను ధాటికి నష్టపోయిన రైతులను ఎలా ఓదార్చాలో అర్థం కావడంలేదని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆమె నేడు పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరా లెక్కన నష్టపరిహారం చెల్లించాలని సర్కారును డిమాండ్ చేశారు. తుపాను బాధిత మత్స్యకారుల రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఆమె తన పర్యటనలో భాగంగా పెద్ద కొజ్జీరియా, చిన్న కొజ్జీరియా, దాడిపూడి ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. గతంలో తాము రైతులకు, మత్స్యకారులకు ఇచ్చిన హామీలను జగన్ అధికారంలోకి రాగానే నెరవేరుస్తాడని విజయమ్మ చెప్పారు.

ఇక ఉద్యమం గురించి స్పందిస్తూ, సమైక్య నినాదం వినిపిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. విజయనగరంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, ప్రభుత్వం ఉందా? లేదా? అన్న సందేహం కలుగుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News