: అద్వానీకి మోడీ ఆత్మీయ ఆతిథ్యం
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత అద్వానీ లు అహ్మదాబాద్ లో కొత్తగా నెలకొల్పిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ మేనేజ్ మెంట్(ఐఐటీఆర్ఏఎం) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అద్వానీకి మోడీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. వీరిద్దరూ సోమనాథ్ ఆలయ ట్రస్టుకి సంబంధించిన ఒక అంతరంగిక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సబర్మతీ నదీ తీరం వెంబడి ఏర్పాటు చేసిన పలు ఉద్యానవనాలను అద్వానీ ప్రారంభించారు. అన్ని కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సీనియర్ నేత అద్వానీ వెంటే ఉన్నారు.