: బెయిలీ విధ్వంసం.. టీమిండియాకు మరోసారి అగ్నిపరీక్ష
ధోనీసేనకు మరోసారి అగ్నిపరీక్ష ఎదురైంది. కెప్టెన్ జార్జ్ బెయిలీ (50 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సులు) విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో ఆసీస్ రెండో వన్డేలో 5 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగులు వెల్లువెత్తించారు. కంగారూ టాపార్డర్ విశేషంగా రాణించడంతో ఆ జట్టు మరోసారి ట్రిపుల్ మార్కు అధిగమించింది. కెప్టెన్ బెయిలీకి తోడు హ్యూస్ (83), ఫించ్ (50), వాట్సన్ (59), గ్లెన్ మ్యాక్స్ వెల్ (53) రాణించారు. కాగా, భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు. గతి తప్పిన బౌలింగ్ తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భువనేశ్వర్, ఇషాంత్, వినయ్, అశ్విన్, జడేజా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.