: అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్న హరీశ్ రావు


మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. సిద్ధిపేటలో ఈ నెల 14 నుంచి మొదలైన ఈ క్రతువు 26తో ముగుస్తుంది. ఈ రోజు యాగంలో పాల్గొని పూజలు చేసిన హరీశ్ రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా యాగంలో పాల్గొంటారని తెలిపారు. అతిరుద్రానికి సిద్ధిపేట ఆతిథ్యమిస్తుండడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News