: ఆటకంటే తాను గొప్పవాడినని సచిన్ ఏనాడూ భావించలేదు: లక్ష్మణ్


క్రికెట్ కంటే తాను గొప్పవాడినని బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఏనాడూ భావించలేదని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వర్థమాన ఆటగాళ్లు సచిన్ ను చూసి ఈ విషయం నేర్చుకోవడం చాలా అవసరమని సూచించారు. మాస్టర్ తో కలిసి 16 ఏళ్లు డ్రెస్సింగ్ రూం పంచుకోవడం కంటే గౌరవం ఏముంటుందని లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. సహచర క్రికెటర్లను సచిన్ గౌరవించే తీరు అతనికి ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టిందని తెలిపారు. సచిన్ లో ప్రత్యేక నైపుణ్యం ఉందని, అంకిత భావంతో ఆడాడని, జట్టు అవసరాలకు అనుగుణంగా నడుచుకున్నాడని లక్ష్మణ్ తెలిపారు. గాయాల బారినపడి మళ్లీ జట్టులోకి రావడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తాను 1996లో సచిన్ కెప్టెన్ గా ఉన్నప్పుడే జాతీయ జట్టులోకి వచ్చానని, అప్పట్లో డ్రెస్సింగ్ రూంలో సచిన్ అందరితోనూ కలుపుగోలుగా ఉండేవాడని లక్ష్మణ్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News