: ఆశారాం కొడుకు కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
అత్యాచార ఆరోపణలతో పరారైన అధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కొడుకు నారాయణసాయి కోసం గుజరాత్, ఢిల్లీ పోలీసులు జల్లెడపడుతున్నారు. పశ్చిమ ఢిల్లీలోని అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 2001-2005 మధ్యలో నారాయణసాయి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ 30 ఏళ్ల మహిళ ఈ నెల 6 న సూరత్ లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు కూడా తమను బలవంతంగా 9 ఏళ్ల పాటు తండ్రీ కొడుకులు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు.