: వైఎస్సార్సీపీ సమైక్య సభ 19న కాదా?


వైఎస్సార్సీపీ 'సమైక్య శంఖారావం' సభ ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విషయమై సందేహాలు నెలకొన్నాయి. పోలీసులు అనుమతి నిరాకరించినా సభ జరుపుకోవడానికి హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, సభ నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామంటూ ఆ పార్టీ నేత మైసూరారెడ్డి ప్రకటించడంతో 19న జరగకపోవచ్చని తెలుస్తోంది. తక్కువ సమయం ఉండడంతో మరొక రోజు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై వైఎస్సార్సీపీ నుంచి ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News