: తిరుమలలో విదేశీ కరెన్సీ చోరీ.. పట్టుబడ్డ దొంగ


తిరుమలలో ఈ రోజు ఉదయం భారీ దొంగతనం జరిగింది. దుబాయ్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రశాంత్ సక్సేనా అనే భక్తుడికి సంబంధించిన రూ. 18 లక్షల విలువైన విదేశీ కరెన్సీ దొంగతనానికి గురైంది. దీంతో, వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీవారి మహాద్వారం వద్ద అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన పాత దొంగ రాజాను పట్టుకున్నారు. అతని నుంచి సొమ్మును రికవరీ చేశారు. ఈ డబ్బును శ్రీవారి హుండీలో వేయడానికి తెచ్చానని సక్సేనా తెలిపారు.

  • Loading...

More Telugu News