: మహబూబ్ నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
మహబూబ్ నగర్ జిల్లాలో మహమ్మారి స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. నాగర్ కర్నూలు పరిధిలోని తూడుకుర్తిలో ముగ్గురు వ్యక్తులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, వారికి నిజంగా స్వైన్ ఫ్లూయే సోకిందా లేక ఇతర వ్యాధేమైనా సోకిందా అనేది నిర్థారణ కావాల్సి ఉంది. దీనిపై వైద్యులు ఏ ప్రకటనా విడుదల చేయలేదు. మరోవైపు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.