: చివరి టెస్టులో సచిన్ 'ట్రిపుల్' కొట్టాలంటున్న సన్నీ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు అనంతరం రిటైరవ్వనుండగా, ఆ మ్యాచ్ లో సచిన్ ట్రిపుల్ సెంచరీ సాధించాలంటున్నాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఎన్డీటీవీతో మాట్లాడుతూ, 'కెరీర్ చివరి మ్యాచ్ లో సచిన్ సెంచరీ సాధించాలి. అయితే, అది డబుల్ సెంచరీగానీ, ట్రిపుల్ సెంచరీగానీ అయితే మరీ మంచిది. క్రికెట్ కు ఘనంగా వీడ్కోలు పలికినట్టుంటుంది' అని వ్యాఖ్యానించారు. సచిన్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం ముంబయిలోని వాంఖెడేలోనే చేశాడని, కెరీర్ కూడా అక్కడే ముగించనుండడం ఎంతో ప్రత్యేకమన్నాడు. కాగా, సచిన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను సొంత మైదానం ముంబయి వాంఖెడే స్టేడియంలో ఆడనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఈ మేరకు ప్రకటించింది.