: వైఎస్సార్సీపీ 'సమైక్య శంఖారావం' సభకు అనుమతి
వైఎస్సార్సీపీ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు నిబంధనల ప్రకారం ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభను నిర్వహించుకోవచ్చు. నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబోమని పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.