: భక్తి శ్రద్ధలతో బక్రీద్
బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈద్గాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదు పాతబస్తీలోని మీరాలం ఈద్గాలోనూ బక్రీద్ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. బక్రీద్ నేపథ్యంలో హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ఇక, నగరంలోని యూసుఫ్ గూడ పోలీస్ మైదానంలోనూ ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. బోరబండ, రహ్మత్ నగర్, ఎర్రగడ్డ పరిసరప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు ఇక్కడికి వచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు.