: విశాఖపట్నం చేరుకున్న విజయమ్మ
తుపాను బాధితులను పరామర్శించడానికి బయల్దేరి వెళ్లిన వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వైజాగ్ చేరుకున్నారు. విశాఖలో పార్టీ నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ నుంచి ఆమె రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వెళతారు. ఈ పర్యటనలో ఆమె ఫైలిన్ తుపాను ధాటికి నష్టపోయిన కొబ్బరి, జీడి రైతులను, మత్స్యకారులను పరామర్శించనున్నారు. అలాగే, దెబ్బతిన్న రహదారులను, విద్యుత్ వ్యవస్థను పరిశీలిస్తారు. సాయంత్రానికి పర్యటన ముగించుకుని రాత్రి పలాసలో బస చేస్తారు.