: అహ్మదాబాద్ సభలో పాల్గొననున్న అద్వానీ, మోడీ
ఈ రోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగనున్న సభలో నరేంద్ర మోడీతో పాటు బీజేపీ సీనియర్ నేత అద్వానీ కూడా పాల్గొంటున్నారు. సబర్మతీ తీరం వెంబడి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన ఉద్యానవనాల్ని వీరిద్దరూ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా జరిగే సభలో వీరిద్దరూ ప్రసంగిస్తారు.
మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తర్వాత అద్వానీ కినుక వహించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య కొంత కాలం కోల్డ్ వార్ కొనసాగింది. దీనికి ముగింపు పలుకుతూ గత నెలలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన బహిరంగసభలో వీరిద్దరూ పాల్గొని తమ మధ్య విభేదాలు లేవని తెలియజేశారు. ఇప్పుడు అహ్మదాబాద్ లో జరగనున్న సభ వీరిద్దరూ కలసి పాల్గొంటున్న రెండో సభ. ఈ సభలో వీరిద్దరూ కలసి పాల్గొంటుండటంతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.