: టీమిండియా లోపాలు దిద్దుకుంటేనే..


మైకేల్ క్లార్క్ గైర్హాజరీలో బలహీనపడిందనుకున్న ఆసీస్ జట్టు అనూహ్యంగా తొలి వన్డేలో భారీ విజయం సాధించింది. ఇది నిస్సందేహంగా టీమిండియాకు ఘోర పరాభవమే. ఆసీస్ జట్టులో పేరున్న ఆటగాళ్ళు వాట్సన్ మినహా మరెవ్వరూలేరు. అయినా, ఆ జట్టు మూడొందల పైచిలుకు స్కోరు చేసి భారత్ కు సవాలు విసిరింది. సొంతగడ్డపై ఆ స్కోరును ఛేదించడంలో విఫలమైన ధోనీ సేన దారుణ పరాజయాన్ని చవిచూసింది. కంగారూల పాటవం కన్నా బౌలర్ల,బ్యాట్స్ మన్ల మూకుమ్మడి వైఫల్యమే పుణే వన్డే ఓటమికి కారణం. ఈ నేపథ్యంలో రేపు ఆసీస్ తో రెండో వన్డే జరగనుంది. ఈ డే-నైట్ పోరుకు జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదిక. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో లోపాలు సరిదిద్దుకుంటేనే భారత్ కు విజయం దక్కుతుంది. లేకుంటే, తొలి వన్డేలో మాదిరే మరో ఓటమి తప్పకపోవచ్చు.

  • Loading...

More Telugu News