: ప్రియాంక ఎన్నికల బరిలో దిగాలి: అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంకా వాద్రా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. 2014లో ప్రియాంక ఎన్నికల బరిలో దిగాలని అలహాబాద్ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ ఓ తీర్మానం కూడా చేసింది. ఆమె ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగితే బాగుంటుందని కూడా కమిటీ సూచిస్తోంది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫుల్పూర్ లోక్ సభ స్థానం నుంచే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారని, ఇక్కడి నుంచి ప్రియాంక పోటీ చేస్తే ఆమెకు తిరుగుండదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక ఫుల్పూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తే, తాము ఏకగ్రీవంగా అంగీకరిస్తామని యూపీ కాంగ్రెస్ నేత అభయ్ అవస్థి తెలిపారు.