: విద్యుత్ కోతలను అరికట్టలేకుంటే గద్దె దిగండి: సీపీఐ
రాష్ట్రంలో ప్రజలకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని సీపీఐ డిమాండ్ చేసింది. విద్యుత్ కోతలకు నిరసనగా హైదరాబాదు నారాయణగూడ నుంచి హిమాయత్ నగర్ వరకు సీపీఐ నేతలు లాంతర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కరెంట్ కోతలు తొలగించేలా సర్కారు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సీపీఐ హెచ్చరించింది.