: పురంధేశ్వరికి డిపాజిట్ కూడా దక్కదు: ఏయూ విద్యార్థి జేఏసీ


రానున్న ఎన్నికల్లో పురంధేశ్వరి డిపాజిట్ కూడా దక్కించుకోలేరని ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఓ వార్తా ఛానల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారని వారు విమర్శించారు. 'తెలంగాణ ఏర్పాటు అనివార్యంగా కనిపిస్తున్న తరుణంలో... సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడితే బాగుంటుంది' అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారని విద్యార్థి నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు సమైక్యానికి మద్దతివ్వకుండా... అధిష్ఠానానికి వత్తాసు పలుకుతున్నట్టున్నాయని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద పురంధేశ్వరి దిష్టిబొమ్మను తగలబెట్టి, ఆమెకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News