: జగతి పెట్టుబడులపై న్యాయప్రాధికార సంస్థలో వాదనలు పూర్తి
జగతిలో దండమూడి, రామచంద్రన్, కణ్ణన్ పెట్టుబడులపై ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) న్యాయప్రాధికార సంస్థలో వాదనలు పూర్తయ్యాయి. డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు ఆకర్షించారని ఈడీ వాదనలు వినిపించగా, డెలాయిట్ నివేదిక కన్నా ముందే పెట్టుబడులు వచ్చాయని జగతి పబ్లికేషన్స్ వాదించింది.