: 9 ఏళ్లు అత్యాచారం చేసిన ఆశారాం, అతని కొడుకు సాయి
వివాదాస్పద స్వామీజీ ఆశారాం, అతని కొడుకు నారాయణ సాయి తమపై అత్యాచారం చేసినట్లు సూరత్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫిర్యాదు చేశారు. ఒక యువతి తనపై ఆశారాం అత్యాచారం చేసినట్టు ఆరోపించగా, మరో యువతి అతని కొడుకు నారాయణ సాయి తనపై అత్యాచారం చేసినట్టు ఆరోపించింది. అహ్మదాబాద్ శివార్లలోని ఆశ్రమంలో ఉండగా 1997 నుంచి 2006 వరకు తమపై వారిద్దరూ లైంగిక దాడి చేసినట్టు తెలిపారు. నారాయణసాయి తరచుగా తనపై అత్యాచారం చేసినట్టు చెల్లెలు ఆరోపించింది. కాగా, నేడు పటిష్ఠ భద్రత మధ్య ఆశారాం ను పోలీసులు గుజరాత్ గాంధీనగర్ కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు ఈ నెల 19 వరకు పోలీస్ కస్టడీ విధించారు. పరారీలో ఉన్న నారాయణ సాయి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.