: దోచుకున్న సొమ్ముతో ఓట్లు కొనేందుకు రంగం సిద్ధం: యనమల


వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దోచుకున్న సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు జగన్ అండ్ కో రంగం సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించే ఇలాంటి అవినీతిపరుల పట్ల జాగరూకత ప్రదర్శించాలని సూచించారు. జగన్ పై సీబీఐ ఇప్పటివరకు పది చార్జ్ షీట్లు దాఖలు చేసిందని, వాటిలో ఐదింటిపై ఇంతవరకు ఎలాంటి విచారణ జరగకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. జగన్ ఎలాంటివారినైనా మభ్యపెట్టగల సమర్థుడని యనమల పేర్కొన్నారు. అందుకే, బెయిల్ జారీ చేస్తూ విధించిన షరతులను కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ సడలించరాదని కోరారు. కాగా, తాను హైదరాబాద్ విడిచి వెళ్ళేందుకు అనుమతించాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News