: 'అల్లా' పదాన్ని ముస్లింలే వాడాలట..
దేవుడిని ప్రస్తావించేందుకు 'అల్లా' పదాన్ని వాడరాదని మలేసియన్ కోర్టు ఒకటి క్రిస్టియన్ వార్తా పత్రికను ఆదేశించింది. 'అల్లా' పదాన్ని తనకు చెందిన మలై భాషా పత్రికలో వాడరాదంటూ మలేసియా ప్రభుత్వం 2009లో నిషేధం విధించడాన్ని హెరాల్డ్ పత్రిక కోర్టులో సవాలు చేయగా.. రాజ్యాంగపరమైన హక్కులలో జోక్యం చేసుకోబోమని కోర్టు తీర్పు చెప్పింది. 'అల్లా' పదాన్ని క్రిస్టియన్ మత విశ్వాసాలు, వ్యవహారాల్లో ఉపయోగించడం భాగం కాదని గుర్తించినట్లు పేర్కొంది. దీనిపై ఫెడరల్ కోర్టుకు వెళతామని హెరాల్డ్ పత్రిక ప్రకటించింది.