: అంతరించిన వాయుగుండం.. ముగిసిన హెచ్చరికలు
గత రాత్రి పశ్చిమబెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడిన వాయుగుండం ఈ ఉదయానికి మరింత బలహీనపడి అంతరించిపోయింది. అల్పపీడనం కూడా లేకపోవడంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గాలులు కూడా తగ్గిపోయాయి. మత్స్యకారులకు జారీ చేసిన ప్రమాద హెచ్చరికలను అధికారులు ఎత్తివేశారు. అయితే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉండడంతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.