: వీవీఎస్ పెవిలియన్ నుంచి వీవీఎస్ కామెంట్రీ..!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ వ్యాఖ్యాతగా కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. తాజాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నై టెస్టుతో కామెంటేటర్ కెరీర్ కు శ్రీకారం చుట్టిన లక్ష్మణ్ ఇప్పుడు సొంతగడ్డపై తన గొంతుక వినిపిస్తున్నాడు. లక్ష్మణ్ రిటైరైన తర్వాత హైదరాబాద్ క్రికెట్ సంఘం అతని గౌరవార్థం ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు అతని పేరే పెట్టింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో రెండో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో.. వీవీఎస్ పెవిలియన్ లో ఉన్న కామెంట్రీ బాక్స్ నుంచి లక్ష్మణ్ తన ముక్కు సూటి వ్యాఖ్యానంతో అందర్నీ అలరిస్తున్నాడు. క్రికెట్ లో కొనసాగినంత కాలం ఆచితూచి మాట్లాడిన లక్ష్మణ్.. సెకెండ్ ఇన్నింగ్స్ లో మాత్రం నిర్మొహమాటంగా మాట్లాడుతూ నిండైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు.