: సచిన్ చివరి టెస్టు సొంత మైదానంలోనే


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెరీర్ చివరి టెస్టుకు స్వంత మైదానమే వేదిక కానుంది. సచిన్ 200వ టెస్టు మ్యాచ్ కు వేదికగా ముంబై వాంఖడే స్టేడియంను ఖరారు చేస్తూ బీసీసీఐ నేడు నిర్ణయం తీసుకుంది. రొటేషన్ ప్రకారం ఆ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక కావాల్సి ఉన్నా..ఈ దిగ్గజ క్రికెటర్ తను వీడ్కోలు మ్యాచ్ ను వాంఖడే మైదానంలో ఆడాలనుకుంటున్నట్టు బీసీసీఐకి తెలిపాడు. ఈ మేరకు నవంబర్ 14 నుంచి 18 వరకు విండీస్ జట్టుతో జరగనున్న టెస్టుకు వేదికగా ముంబైలోని వాంఖడే స్టేడియంను నిర్ణయించింది. కెరీర్ లో ఇప్పటివరకు 198 టెస్టులాడిన సచిన్ 199వ టెస్టును నవంబర్ 6న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ పై ఆడనున్నాడు.

  • Loading...

More Telugu News