: నిమ్మతో నిగనిగలాడే అందం


మన వంటింట్లో కనిపించే నిమ్మకాయలని కేవలం పులిహోర లాంటివి తయారుచేయడానికే కాదు, ఊరగాయకు, ఇతర వంటకాలకు కూడా వినియోగిస్తాం. ఇంకా ఎండాకాలంలో చల్లటి జ్యూస్‌ చేసుకుని తాగుతాం. అయితే ఇదే నిమ్మకాయతో మన అందాన్ని ఇనుమడింపజేసుకోవచ్చు. ముఖం నిగనిగలాడేందుకు మార్కెట్లో రకరకాల క్రీములు, లోషన్లు దొరుకుతుంటాయి. కానీ, వాటిని ముఖానికి పూయడం వల్ల కొద్దిరోజులకు ముఖంలోని జీవకళ తగ్గిపోతుంది. అలాకాకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే ముఖంపై ముడతలు తగ్గుతాయి, వయసు పెరుగుదల కూడా కనిపించకుండా ఉంటుంది.

నిమ్మరసాన్ని ఎండాకాలంలోనే మనం తాగుతుంటాం. ఎండలో తిరిగి అలసిపోయి వచ్చిన సమయంలో శరీరానికి తగు నీటిని అందించడంతోబాటు, సేదతీరేందుకు మజ్జిగలో నిమ్మకాయ కలుపుకుని తాగుతుంటాం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ దానికి ప్రత్యేకమైన రుచినిస్తుంది. ఇందులో విటమిన్‌ బి, క్యాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రొటీన్స్‌, కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా లభిస్తాయి. అజీర్ణంతో బాధపడేవారు కాస్త నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. గుండెల్లో మంట, డయేరియా ఉన్న వారికి కూడా నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. అందానికి కూడా నిమ్మను ఉపయోగిస్తారు.

నిమ్మరసాన్ని చర్మానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు మటుమాయం అవుతాయి. చర్మం కూడా నిగారింపును సంతరించుకుంటుంది. ముఖంపై వచ్చే బ్లాక్‌హెడ్స్‌ని నివారిస్తుంది. పన్నునొప్పితో బాఢపడేవారు నిమ్మరసాన్ని నొప్పి ఉన్నచోట పెడితే కాస్త ఉపశమనం కలుగుతుంది. పళ్ల చిగుళ్లనుండి రక్తం కారుతున్నా, నోటినుండి దుర్వాసన వస్తున్నా నిమ్మరసం వాటిని తగ్గిస్తుంది. లెమన్‌ జ్యూస్‌ బీపీని అదుపులో ఉంచుతుంది. నీరసంగా ఉండేవారికి ఇది చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందిపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుందట. నిమ్మకాయతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిసిందిగా. ఇక చక్కగా నిమ్మని అవసరం మేరకు వాడుతూ అందంగా, ఆరోగ్యంగా ఉందాం!

  • Loading...

More Telugu News