: విజయవాడ తొలి మేయర్ వెంకటేశ్వరరావు కన్నుమూత


విజయవాడ తొలి మేయరు టి.వెంకటేశ్వరరావు(97) ఈ రోజు కన్ను మూశారు. ఆయన 1981-83, 1995-2000 సంవత్సరాల మధ్య కాలంలో విజయవాడ మేయర్ గా రెండు సార్లు పనిచేశారు. నగరంలో పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అఖిల భారత మేయర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. వెంకటేశ్వరరావు మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News