: ఢిల్లీలో నిరసన తెలిపేందుకు సీమాంధ్ర లాయర్ల నిర్ణయం
సమైక్యాంధ్ర నిరసనలు ఢిల్లీలోనూ చేపట్టాలని సీమాంధ్ర లాయర్ల జేఏసీ నిర్ణయించింది. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ నెల 18న హస్తిన వెళ్ళి ఆందోళన చేపట్టాలని నిర్ణయించామని సీమాంధ్ర లాయర్ల జేఏసీ కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఈ నిరసన కార్యక్రమంలో వెయ్యిమందికి పైగా సీమాంధ్ర న్యాయవాదులు పాల్గొంటారని ఆయన తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.