: అసెంబ్లీకి వచ్చేది బిల్లో, తీర్మానమో షిండేని అడిగి చెబుతా: దిగ్విజయ్
అస్పష్టమైన ప్రకటనలతో దిగ్విజయ్ సింగ్ అయోమయం సృష్టిస్తున్నారు. తనపై తీవ్ర విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకోవడంలేదు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేది తెలంగాణ బిల్లో, తీర్మానమో హోం మంత్రి షిండేని అడిగి చెబుతానని అన్నారు. షిండేతో చర్చించాకే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇక ఎన్నికలకు ముందే తెలంగాణ వస్తుందన్న చాకో వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు.