: వాయుగుండంగా మారిన 'ఫైలిన్'.. బీహార్ పయనం
ఫైలిన్ తుపాను క్రమేణా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది బీహార్ దిశగా పయనిస్తోందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఉత్తర కోస్తాలో పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొంది. తేలికపాటి జల్లులు, 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. కాగా, తుపాను ప్రభావిత ఒడిశాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు.