: ఆయుధాలతో ఉన్న అమెరికా ఓడ.. కోస్ట్ గార్డ్ అదుపులో సిబ్బంది
సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో ఉన్న అమెరికా ఓడ అనుమతి పత్రాల్లేకుండా భారత జలాల్లోకి అడుగుపెట్టింది. తమిళనాడులోని ట్యుటికోరిన్ వద్ద ఎంవీ సీమ్యాన్ గార్డ్ అనే ఆ ఓడను ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అధికారులు ఆ నౌకకు చెందిన సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఓడలో పది మంది సిబ్బందితోపాటు 25 మంది సాయుధులు ఉన్నట్టు తెలుస్తోంది. వారు భారత జలాల్లోకి ఎందుకు ప్రవేశించిందీ సరిగా వివరించలేకపోతున్నారని అధికారులు తెలిపారు.