: కేంద్రం మైనారిటీలో ఉందంటున్న లగడపాటి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో ఉందంటున్నారు. తన రాజీనామా లేఖను ఆమోదింపజేసుకునేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు. స్పీకర్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు నిరాశ తప్పలేదు. స్పీకర్ మీరా కుమార్ కార్యాలయంలో లేకపోవడమే అందుకు కారణం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లగడపాటి.. కేంద్ర ప్రభుత్వంతో తమకిక సంబంధం లేదని, రాజీనామాలు ఆమోదింపజేసుకోవడమే తమకు ముఖ్యమని ఉద్ఘాటించారు.