: కాగితపు జనరేటర్లు!


జనరేటర్లు అంటే ఏ ఆయిలో పోస్తే పనిచేస్తూ కరెంటును ఉత్పత్తి చేస్తుంది. అలా కాకుండా మనం చేతితో రుద్దితే కరెంటు పుడితే... అందునా పేపర్లు ఇలా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటే... అది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇలాంటి పేపర్లను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ పేపర్లు చేతితో రుద్దితేనే చాలు కరెంటును ఉత్పత్తి చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కార్నెగీ మెల్లాన్‌, పిట్స్‌ బర్గ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఒక కొత్తరకం కాగితాలను తయారుచేశారు. ఈ కాగితాలను వేలితో రుద్దితే చాలు, అవి ఛార్జ్‌ అయ్యేలా పేపర్‌ జనరేటర్లను అభివృద్ధి చేశారు. ఈ కాగితాలతో విద్యుత్తు సరఫరా అవసరం లేని ఎల్‌ఈడీలు, ఈ రీడర్‌ డిస్‌ప్లేను రూపొందించవచ్చని వారు చెబుతున్నారు. ఈ కొత్త రకం కాగితాలను పుస్తకాలు, పోస్టర్ల రూపంలో ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News