: ఆలయంలో తొక్కిసలాటపై సోనియా దిగ్భ్రాంతి


మధ్యప్రదేశ్ లోని రతన్ గఢ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 64 మంది మృతి చెందిన ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. వంతెన కూలిపోతోందంటూ వదంతి రాగా, దానిపై బారులు తీరిన భక్తుల నడుమ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో, అనేక మంది అక్కడిక్కడే మరణించగా, కొందరు పక్కనే ఉన్న నదిలో పడి గల్లంతయ్యారు.

  • Loading...

More Telugu News