: అనుమతి నిరాకరణ ముఖ్యమంత్రి కుట్రే: వైఎస్సార్సీపీ
వైఎస్సార్సీపీ హైదరాబాదులో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం వెనుక అసలు సూత్రధారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని వైఎస్సార్సీపీ ఆరోపించింది. సమైక్యానికి కట్టుబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని.. ఆయన సారథ్యంలో సమైక్యాంధ్ర కోసం ఉద్ధృతపోరాటం చేస్తామని తెలిపింది. సభకు అనుమతినివ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.