: తొక్కిసలాటలో పెరిగిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్ లోని దాతియా దగ్గర రతన్ గఢ్ గుడిలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 15కు చేరింది. మరో 30 మందికి గాయాలయ్యాయి. దుర్గాపూజ నిమిత్తం భక్తులు ఆలయానికి పోటెత్తడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు భక్తులు ఆలయం ప్రక్కనే ఉన్న నదిలో పడిపోయారు.