: మనిషీ మేలుకో... అంటూ మరణిస్తున్న చిరు ప్రాణి!
అదొక ద్వీపం..మనిషి జాడే తెలియని ఆ ద్వీపంలో కొన్ని వేల పక్షులు నివాసముంటున్నాయి. అయినా వాటి జీవితాలను మనిషి చిదిమేస్తున్నాడు. మనకు అవసరం లేని వస్తువులను నీటిలో పడేయడం మనిషికి ఉన్న సాధారణ అలవాటు. అదే ఆ పక్షుల పాలిట శాపంగా మారుతోంది.
సముద్రంలో కనిపిస్తున్న చిన్న చిన్న వస్తువులను ఆహారంగా భ్రమించి వాటిని తింటున్నాయి పక్షులు. అలా తినడం వల్ల చనిపోయిన పక్షుల కడుపులో మనిషి వాడే ఎన్నో రకాల పరికరాలు, వస్తువులు ఉండటం గగుర్పొడుస్తోంది.
సముద్రంలో కనిపిస్తున్న చిన్న చిన్న వస్తువులను ఆహారంగా భ్రమించి వాటిని తింటున్నాయి పక్షులు. అలా తినడం వల్ల చనిపోయిన పక్షుల కడుపులో మనిషి వాడే ఎన్నో రకాల పరికరాలు, వస్తువులు ఉండటం గగుర్పొడుస్తోంది.
మనిషి చేతిలో ప్రకృతి ఎంత దారుణమైన స్థితికి చేరుతుందో తెలుపుతోంది ఉత్తర పసిఫిక్ సముద్రంలోని మిడ్ వే ద్వీపం. మనిషి తెలిసి చేసినా, తెలియక చేసినా మరో ప్రాణి మరణానికి పరోక్షంగా కారణమౌతున్నాడని ఈ ఉదంతం తెలుపుతోంది. ఇకపైనైనా చేతిలో వస్తువు పారవేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని పక్షులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అంటున్నారు.