: ముషారఫ్ పాక్ ను విడిచి వెళ్లలేరు: పాక్ హోంమంత్రి
పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ దేశం విడిచి వెళ్లలేరని పాక్ హోం మంత్రి నిసార్ అలీ ఖాన్ తెలిపారు. ముషారఫ్ పేరు దేశం విడిచి వెళ్లకూడని వ్యక్తుల జాబితాలో ఉందన్నారు. కోర్టు అనుమతించే వరకూ ఆయన పేరు జాబితా నుంచి తొలగించబోమన్నారు. బెనజీర్ భుట్టో హత్య సహా పలు కేసులను ముషారఫ్ ఎదుర్కొంటున్నారు. మూడు కేసులలో కోర్టు ముషారఫ్ కు బెయిల్ మంజూరు చేయగా.. లాల్ మసీదు కేసులో మాత్రం బెయిల్ రాలేదు. అందులోనూ బెయిల్ వస్తే మళ్లీ ప్రవాసానికి పారిపోదామన్నది ముషారఫ్ యోచన. ఎన్నికల్లో గెలుస్తానన్న ఆశతో కొన్ని నెలల క్రితం పాక్ లో అడుగుపెట్టిన ముషారఫ్ కు కోర్కె తీరకపోగా పాత కేసులు మెడకు చుట్టుకున్నాయి.