: కారు నడుపుతూనే టీనేజర్ల చాటింగ్


అమెరికాలో టీనేజర్లకు కాస్త కూడా భయం లేకుండా పోయింది. వారు కారు డ్రైవింగ్ చేస్తూనే మొబైల్ ఫోన్ నుంచి ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నారట. ప్రతీ ఐదుగురు టీనేజర్లలో నలుగురు చేసే పని ఇదేనట. ముఖ్యంగా అబ్బాయిలే ఈ విషయంలో ముందున్నారు. కారు నడుపుతూ మెస్సేజ్ చేయడం ప్రమాదకరమని సర్వేలో చాలా మంది ఒప్పుకున్నారు. అంటే, తెలిసీ వారు తమ ప్రాణాలను రిస్కులో పెడుతున్నారని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News