: బాబుకు మోడీ ఫోన్
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. బాబు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బాబు ఏపీ భవన్ లో దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేసి ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలోనూ బాబు దీక్ష కొనసాగించే ప్రయత్నం చేసినా, ఆరోగ్యం మరీ క్షీణిస్తుండడంతో వైద్యులు బలవంతంగా ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు.