: ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులూ.. జాగ్రత్త


ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులు పెరిగిపోతూ ఉండడంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది. రాజకీయ పార్టీల తరుపున బరిలో నిలిచిన అసలైన అభ్యర్థులు.. తమ ఖర్చును తగ్గించి చూపుకునేందుకు వీలుగా డమ్మీ అభ్యర్థులను నిలబెడుతున్నారని ఎలక్షన్ కమిషన్ అధికారులు అంటున్నారు. దీంతో ఇలాంటి డమ్మీలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. డమ్మీలుగా ఉన్నవారు రాజకీయ పార్టీల అభ్యర్థులకు వాహనాలు, ఏజెంట్లను సమకూర్చడం, ప్రచారం తదితర పనుల్లో సహాయపడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. అంటే, తమ పేరుతో అనుమతి పొంది వేరే అభ్యర్థికి ఆ సౌలభ్యతను అందజేస్తున్నారు. నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నందున వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తమయ్యారు.

  • Loading...

More Telugu News